థాంక్యూ ప్రభాస్‌ డార్లింగ్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు దర్శక ధీరుడు రాజమోళి సోషల్‌మీడియా ద్వారా ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌ మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడని.. ఈ ప్రయాణం ఒక నరకం లాంటిదని పేర్కొన్నారు. ‘బాహుబలి’ సినిమాపై ప్రభాస్‌కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదన్నారు. అందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. 2015లో విడుదలైన ‘బాహుబలి’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి- ది కంక్లూజన్‌’ ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments